న్యూఢిల్లీ: నీట్ నిరసన ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో సోమవారం ఆందోళనకారులపై జరిగిన లాఠీఛార్జ్ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తీవ్రంగా ఖండించారు. నడిరోడ్డుపై విద్యార్థులపై దాడి చేయడం దిగ్భ్రాంతికరమని, ఈ సమస్యను ప్రభుత్వం చాలా దారుణంగా హ్యాండిల్ చేసిందన్నారు. లాఠీచార్జ్‌లో గాయపడిన విద్యార్థులను మంగళవారం రాత్రి జంతర్ మంతర్ ఆందోళన వేదిక వద్ద థరూర్ పరామర్శించారు.
ఈ విషయంపై బుధవారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల బాధాకరమైన వాదనలు చెప్పింది విని తాను తీవ్రంగా చలించిపోయానని చెప్పారు. ‘‘ఓ విద్యార్థి కంటి కింద, తలపై లాఠీలతో కొట్టారు. ఓ అమ్మాయితో పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం’’ అని తెలిపారు.
