న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేమనే దానికి ప్రధాన్ రాజీనామా ఒక నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులు వారాలుగా వినిపించిన దృఢమైన, శాంతియుత ఆందోళనల విజయం ఇది అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. మంత్రి తరగతి గదిని విడిచి వెళ్లారు.. కానీ, ప్రభుత్వం ఇంకా ప్రశ్నపత్రానికి సమాధానం చెప్పాలి అని కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ అన్నారు.
