ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ, రేణుక జోరు

ఐసీసీ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ, రేణుక జోరు

దుబాయ్: శ్రీలంకతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో విజృంభించిన ఇండియా బ్యాటర్ షెఫాలీ వర్మ తన ఐసీసీ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుచుకుంది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో పది నుంచి ఆరో స్థానానికి దూసుకొచ్చింది. శ్రీలంకతో సిరీస్‌‌‌‌‌‌‌‌లో వరుసగా (69* , 79*, 79*) స్కోర్లు చేయడంతో తను నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుంది. 

నాలుగో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మూడో ర్యాంకును నిలబెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో దీప్తి శర్మ నంబర్ వన్ ర్యాంక్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది. పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకుంది. లంకతో మూడో టీ20లో రేణుక 4 వికెట్లు పడగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్లు శ్రీ చరణి 52వ ర్యాంకుకు, వైష్ణవి శర్మ 124వ ర్యాంకుకు చేరుకున్నారు.