వీడియో: యువ‌తిపై దాడి చేసిన‌ శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్

వీడియో: యువ‌తిపై దాడి చేసిన‌ శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్

శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఓ యువతి పై దాడి చేశాడు. కార్ పార్కింగ్ వివాదంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి దాడికి దారి తీసిందని తెలుస్తోంది. శేరిలింగంపల్లిలోని లక్ష్మీ విహార్ పేజ్2 కాలనీలో నాగేంద్ర యాదవ్ నివాసముంటారు. అదే కాలనీలో యువతి కుటుంబం ఉంటుంది. అడ్డంగా ఉన్న కారు తీయమనడంతో యువ‌తిపై దాడి చేశాడ‌ని యువ‌తి చెబుతోంది. అయితే ఈ సంఘ‌ట‌న‌పై ఇరువురు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవ‌డంతో..ఇద్ద‌రిపై కేసు నమోదైనట్లు చెప్పారు పోలీసులు.

కార్పొరేటర్ ఇంటి సమీపంలో వేణు గోపాల్ కుటుంబం నివాసం ఉంటుంది. వేణుగోపాల్ కుమార్తె కారులో వచ్చింది, అడ్డంగా ఉన్న కార్పొరేటర్ కారు తీయమని కోరింది. కారు పక్కకు తొలగించిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను వేణుగోపాల్ రెండో కుమార్తె వీడియో తీస్తుండగా.. ఆ అమ్మాయిపై చేయి చేసుకున్నాడని, ఇష్టం వచ్చినట్లు తిట్టడని బాధితురాలు ఆరోపించారు. కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పై 323,509 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..యువతిపైన 448,504 సెక్ష‌న్ల‌ కింద కేసు నమోదు చేశామ‌న్నారు. అమ్మాయి వీడియో తీస్తుంటే.. ఆవేశంతో వచ్చి ఆ అమ్మాయిని కొట్టాడు. ఆ కార్పొరేటర్ తాగి ఉన్నడని ఆరోపణ. విచార‌ణ త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు పోలీసులు.