నా లైఫ్‌‌‌‌లో నెగెటివిటీకి నో ప్లేస్‌‌‌‌

నా లైఫ్‌‌‌‌లో  నెగెటివిటీకి నో ప్లేస్‌‌‌‌

న్యూఢిల్లీ: ఐసీసీ ఈవెంట్‌‌‌‌ల్లో అదిరిపోయే రికార్డు ఉన్న టీమిండియా ఓపెనర్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ తన జీవితంలో నెగెటివిటీకి స్థానం లేదన్నాడు. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ప్రారంభానికి ఇంకా రోజులు వ్యవధి మాత్రమే ఉన్నా తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతున్నాడు.  ‘ఐసీసీ ఈవెంట్‌‌‌‌ల్లో నా రికార్డులు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతారు కానీ సుదీర్ఘ కెరీర్‌‌‌‌లో ఆటపట్ల నా దృక్పథం ఎప్పుడు ఒకేలా ఉంది. ప్రతిసారి వందశాతం పెర్ఫామెన్స్‌‌‌‌ చేయాలనే అనుకుంటా.

టెస్ట్‌‌‌‌ అరంగేట్రానికి ముందు తొమ్మిదేళ్లు ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడా. ఆట విషయంలో అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పడు అలానే ఉన్నా.  ఇంగ్లండ్‌‌‌‌లో జరగబోయే మెగా టోర్నీ నా కెరీర్‌‌‌‌లో మరో గొప్ప ఐసీసీ ఈవెంట్‌‌‌‌గా నిలిచిపోతుందని ఆశిస్తున్నా. అలాగని నేనేమి ఒత్తిడిలో లేను. అలాగే విమర్శలను నేను పట్టించుకోను. అసలు వాటి కోసం టైమ్‌‌‌‌ కేటాయించను. వరుసగా పది మ్యాచ్‌‌‌‌ల్లో ఫెయిలైతే నా పని అయిపోనట్టు కాదు. నా సామర్థ్యం నాకు తెలుసు. నా టెక్నిక్‌‌‌‌పై చర్చలు జరుగుతాంటాయి కానీ అందులో ఎలాంటి తప్పులు లేవని పాంటింగ్‌‌‌‌, గంగూలీనే నాకు చెప్పారు. సోషల్‌‌‌‌ మీడియాలో నేను ఉన్నాను కానీ అంత యాక్టివ్‌‌‌‌ పర్సన్‌‌‌‌ని కాను. నెగెటివిటీకి నా లైఫ్‌‌‌‌లో చోటు లేదు’అని ధవన్​ చెప్పుకొచ్చాడు.