సౌతాఫ్రికాతో సిరీస్కు కెప్టెన్గా ధావన్

సౌతాఫ్రికాతో సిరీస్కు కెప్టెన్గా ధావన్

టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. త్వరలో సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరగబోయే టీ20, వన్డే సిరీస్లకు ధావన్ను కెప్టెన్గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని బీసీసీ వర్గాలు వెల్లడించాయి. ధావన్ ఇప్పటికే విండీస్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. జింబాబ్వే టూర్కు కూడా  కెప్టెన్గా ఎంపికైనా..చివరి దశలో కేఎల్ రాహుల్ను కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. 

సీనియర్లకు రెస్ట్..
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే వరల్డ్ కప్కు ముందు వన్డేలు ఉండటం సరికాదని..కానీ..షెడ్యూల్ ప్రకారం వన్డే సిరీస్ జరుగుతుందని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే ఆటగాళ్లందరికీ వన్డే సిరీస్‌ నుంచి విశ్రాంతినిస్తామన్నారు. దీని కారణంగా  వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని వెల్లడించాడు. 

సౌతాఫ్రికా టూర్..
ఈ నెల 28 నుంచి సౌతాఫ్రికాతో భారత్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా భారత్ మూడు టీ20లు, అలాగే మూడు వన్డేలు ఆడనుంది. మొదటి టీ20 సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో జరగనుంది. రెండోది అక్టోబర్ 2న గౌహతిలో, మూడోది అక్టోబర్ 4న ఇండోర్‌లో జరుగుతాయి. ఇక అక్టోబర్ 6 నుంచి వన్డే సిరీస్ మొదలవుతుంది. లక్నో వేదికగా తొలి వన్డే, అక్టోబరు 9, 11తేదీల్లో  రాంచీ, ఢిల్లీలో రెండు , మూడో వన్డే జరగనుంది. 

ద్రావిడ్కు విశ్రాంతి..?
అక్టోబర్ 16 నుంచి టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో..ఆటగాళ్లతో పాటు..కోచ్ ద్రవిడ్కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. స్టాండ్ ఇన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు తెలిపారు.