
బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి సరోగసి ద్వార ఆడ బిడ్డ పుట్టింది. రాజ్ కుంద్రా శిల్పాశెట్టి దంపతులకు ఇప్పటికే కొడుకు వయాన్ (7) ఉన్నాడు. ఫిబ్రవరి 15న ఆడబిడ్డకు పుట్టింది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి తన ఇన్ స్ట్రాగ్రమ్ ద్వారా చెప్పింది. ఇన్నేళ్ల తమ ప్రార్థనలకు ఓ అద్భుతం జరిగిందని..తమ ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని తెలిపింది. చిట్టితల్లి తమ జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందన్నారు. తన గారాల పట్టికి సమీషా కుంద్రా అని పేరు పెట్టామని చెప్పింది. స..అంటే సంస్కృతంలో కలిగి ఉండటం. మిషా అంటే రష్యన్ భాషలో దేవుని లాంటి వ్యక్తి అని అర్థం అని..తమ దేవత ఇంటిని పరిపూర్ణం చేసిందని పోస్ట్ చేసింది.