ప్లీజ్.. నా సినిమా చూడండి: శిల్పా శెట్టి రిక్వెస్ట్

V6 Velugu Posted on Jul 23, 2021

ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన నేపథ్యంలో తన సినిమాను ఇబ్బంది పెట్టొద్దని ఆమె తన ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేసింది. 14 ఏండ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన శిల్పా శెట్టి హంగామా 2 మూవీలో నటించారు. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌‌’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఆ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అయితే భర్త పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ కావడం, పలువురు హీరోయిన్స్, మోడల్స్ కూడా ఆరోపణలు చేస్తుండడంతో తన సినిమాపై ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్‌ పడుతుందోన్న భయంతో శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. సినిమా కోసం హంగామా 2 టీమ్‌ అంతా చాలా కష్టపడిందని, మంచి సినిమాను తేవడం కోసం నటీనటులు, టెక్నీషియన్స్ అంతా కృషి చేశారని, ఆ సినిమాకు ఇబ్బంది కలిగించొద్దని కోరింది. ఈ క్షణంలోనే జీవితాన్ని ఆస్వాదించాలనేది తాను నమ్ముతానని శిల్పా శెట్టి చెప్పింది. ‘‘సో, ఇవాళ మీరంతా ఫ్యామిలీలో కలిసి హంగామా 2 సినిమా చూడండి. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు నింపడం మీతోనే సాధ్యం. థ్యాంక్యూ! శిల్పా శెట్టి కుంద్రా #Hungama2” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.


ఈ ఏడాది ఫిబ్రవరి 4న ముంబై క్రైం బ్రాంచ్‌లో నమోదైన కేసులో ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు.. బాలీవుడ్‌లో సినిమాల్లో నటించాలని ముంబైకి వచ్చే యువతులకు చాన్స్‌లు ఇప్పిస్తామని చెప్పి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా వాళ్లతో పోర్న్‌ సినిమాల్లో నటింపజేసి, వాటిని యాప్స్‌లో రిలీజ్ చేసినట్లు తేలింది. దీంతో ఇటీవలే అతడిని అరెస్ట్ చేశారు.

Tagged fans, Raj Kundra, shilpa shetty, Hungama2, Porn Films

Latest Videos

Subscribe Now

More News