V6 News

హనుమ కొండలోని ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం

హనుమ కొండలోని ఇంటర్ ఫలితాల్లో షైన్ ప్రభంజనం

హనుమకొండ, వెలుగు: ఇంటర్​ ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు చైర్మన్ మూగుల కుమార్‌‌‌‌‌‌‌‌యాదవ్, డైరెక్టర్లు రమ, అరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్ మూగుల రమేశ్ యాదవ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదివారం వారు అభినందించారు. ఎంపీసీ ఫస్ట్​ఇయర్​లో బి.లిఖితరెడ్డి 468 మార్కులు, ఏ.శైలజ467, ఓ.అర్చన 467, డి.దీక్ష నందిని 467, ఎం.అక్షిత 467, జే.కావ్య 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మెరిశారన్నారు. 

వారితో పాటు 8 మంది విద్యార్థులు 466 మార్కులు సాధించారన్నారు. బీపీసీ ఫస్ట్ ఇయర్ లో కె.వైష్ణవి 437, పి.హాసిని 436, జి.హర్షిణి 433 ఉత్తమ ప్రతిభ చాటారన్నారు. సెకండియర్ ఎంపీసీలో ఎం.దీక్షత 995 మార్కులు సాధించగా, కే.నిశాంత్ 995, ఎం.తేజస్వీ 994, పి.శ్రీసౌమ్య 991, సీహెచ్ విజయ్ కుమార్ 991, ఆర్.అక్షయ 990 మార్కులు పొందారన్నారు. సెకండ్ ఇయర్ బీపీసీలో సీహెచ్ కీర్తన 992, ఎండీ అఖిబ్ అలీ 989, ఎండీ సాదుద్దీన్ 987 సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో షైన్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, జి.ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.