మహా రాష్ట్రలో శివసేనదే అధికారమన్నారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. ఐదేళ్లు కాదు మరో 25 ఏళ్లు శివనసేన పార్టీయే అధికారం చేపడుతుందన్నారు. కామన్ మినిమమ్ ప్రోగ్రాం (సిఎమ్‌పి)తో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. దీనిపై శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిల చర్చిస్తున్నాయన్నారు. ఇది ఒకే పార్టీ ప్రభుత్వం అయినా, కూటమి అయినా, పాలన కోసం ఒక ఎజెండా అవసరం. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. తమతో వస్తున్న వారు అనుభవజ్ఞులైన నిర్వాహకులని… వారి అనుభవం నుండి తాము ప్రయోజనం పొందుతామన్నారు.
