పట్టాతో పాటు విలువలూ ముఖ్యం..నైపుణ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యం: శివధర్ రెడ్డి

పట్టాతో పాటు విలువలూ ముఖ్యం..నైపుణ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యం: శివధర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  విద్యార్థులు కేవలం డిగ్రీ పట్టాలు అందుకోవడమే కాకుండా, సమాజం పట్ల బాధ్యతను, నైతిక విలువలనూ కలిగి ఉండాలని స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్  బి.శివధర్ రెడ్డి సూచించారు. శనివారం ఆయన కీసరలోని హోలీ మేరీ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌‌‌‌ కాలేజీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే–2026 వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని, అప్పుడే దేశాభివృద్ధికి తోడ్పడగలమని చెప్పారు. 

సెంచూరియన్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జేఎం రావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సృజనాత్మకతతో సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ ఏడాది 445 మంది విద్యార్థులు పట్టాలు అందుకోగా, అందులో 91 మంది డిస్టింక్షన్‌‌‌‌లో ఉత్తీర్ణత సాధించారు. కాలేజీ టాపర్‌‌‌‌గా నిలిచిన అఖిల సహా వివిధ విభాగాల టాపర్లకు శివధర్ రెడ్డి గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ. వరప్రసాద్ రెడ్డి  కాలేజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, సెక్రటరీ విజయ శారద రెడ్డి, ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.