- కిషన్‌రెడ్డికి షీప్ ఫెడరేషన్ చైర్మన్ చరణ్ వినతి
హైదరాబాద్, వెలుగు: వరంగల్ (మామునూరు) విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని షీప్ఫెడరేషన్చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం పాలన, భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి తొలి అమరుడిగా నిలిచిన దొడ్డి కొమరయ్య త్యాగాన్ని శాశ్వతంగా గుర్తించేలా మామునూరు విమానాశ్రయానికి ‘అమరవీరుడు దొడ్డి కొమరయ్య విమానాశ్రయం’గా నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రతిపాదనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆమోదం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.కొమరయ్య జన్మభూమి, పోరాట ప్రాంతమైన వరంగల్ ప్రాంతానికి ఈ నామకరణం చారిత్రక గుర్తింపునివ్వడంతో పాటు ఆయన త్యాగానికి ఘన నివాళిగా నిలుస్తుందని చరణ్ కౌశిక్ పేర్కొన్నారు.
