ఫారిన్ టూర్‎కు వెళ్లిన ప్రధాని మోడీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్‎లో 4 రోజుల పర్యటన

ఫారిన్ టూర్‎కు వెళ్లిన ప్రధాని మోడీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్‎లో 4 రోజుల పర్యటన

న్యూఢిల్లీ: మధ్య ఆసియా దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ శనివారం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్​స్తాన్ దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్‌‌‌‌‌‌‌‌కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ఆయన తాష్కెంట్‌‌‌‌‌‌‌‌ చేరుకోనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చించనున్నట్లు మోదీ తెలిపారు. 

ఉజ్బెకిస్తాన్ పర్యటన ముగిసిన అనంతరం, కిర్గిజ్​స్తాన్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు బిష్కెక్‌‌‌‌‌‌‌‌కు పయనం కానున్నారు. అక్కడ జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాద ముప్పు లేని శాంతియుత ప్రాంతంగా మధ్య ఆసియాను తీర్చిదిద్దడంలో భారత్ తరఫున ఆయన కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. బిష్కెక్‌‌‌‌‌‌‌‌లో జరిగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలోనూ ఆయన భాగస్వామ్యం కానున్నారు.