హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పవర్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు శనివారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు కృష్ణభాస్కర్, హరీశ్‌తో భేటీ అయ్యారు. ఉద్యోగులు, కార్మికులు, ఆర్టిజన్ల14 డిమాండ్లపై చర్చించారు. ఉద్యోగుల డిమాండ్లను నేతలు మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఇద్దరు సీఎండీలు స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమ డిమాండ్లపై మరింత లోతుగా చర్చించేందుకు 15 రోజుల్లో మరోసారి భేటీ కావడానికి సీఎండీలు అంగీకరించినట్లుగా జేఏసీ నేతలు తెలిపారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, నాయకులు పాల్గొన్నారు.
