నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీ రాజా

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: శివాజీ రాజా

సినీ నటుడు నాగబాబుపై శివాజీ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నాగబాబు తనకు 30 ఏళ్ల స్నేహితుడు. నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అది తరువాత చెబుతాను” అని శివాజీరాజా వ్యాఖ్యానించారు. ‘ మా’ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత  మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ప్రతి సంవత్సరమూ ‘మా’ డైరీని అందంగా డిజైన్ చేసి వేస్తామని, ఈ సంవత్సరమూ బాగా చేశామని అన్నారు.

డైరీ వేసినందుకు రూ. 14.20 లక్షలు వచ్చిందని గొప్పగా చెప్పుకున్న నరేష్, కేవలం రూ. 7.20 లక్షలు మాత్రమే ఖాతాలో వేశారని.. మిగతా డబ్బు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తాను లెక్కలు చెప్పాల్సిన సమయం వచ్చిందని, ఒకటో తేదీలోగా మిగతా డబ్బు ‘మా’ ఖాతాలో వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మిగతా డబ్బు ఎక్కడుందో చెప్పిన తర్వాత వాళ్లు ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందని అన్నారు.  మీడియాతో తనకు ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉందని, తాను కుట్రలు చేసేవాడినో, కాదో మీడియా మొత్తానికీ తెలుసని అన్నారు.