మహీ భాయ్ కొంచెం రైనా మాట వినండి.. ధోనీని రిక్వెస్ట్ చేసిన దూబే

మహీ భాయ్ కొంచెం రైనా మాట వినండి.. ధోనీని రిక్వెస్ట్ చేసిన దూబే

ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కు ముందు అందరి దృష్టి స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఉంది. వీరితో పాటు కుర్రాళ్ళు ఎలా రాణిస్తారనే విషయం ఆసక్తి కలిగించింది. అయితే ఒక్క మ్యాచ్ తో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు ఆల్ రౌండర్ శివమ్ దూబే.    నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఒక్కడే వారియర్ లా పోరాడి ఒంటి చేత్తో భారత్ కు విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్ లో మెరిసిన ఈ ఆల్ రౌండర్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో సత్తా చాటి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ తర్వాత దూబే, మాజీ బ్యాటర్ సురేష్ రైనా మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. 

దూబే ప్రదర్శనకు ఇంప్రెస్స్ అయిన రైనా.. నీ పెర్ఫామెన్స్ ను చూస్తే ధోనీ నీకు ఐపీఎల్ లో 3 ఓవర్లు ఖచ్చితంగా ఇస్తాడు. అని చెప్పాడు. దీనికి దూబే స్పందిస్తూ ధోనీ భాయ్ నన్ను పట్టించుకోండి అంటూ సరదాగా రిక్వెస్ట్ చేసాడు. దూబే 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ కెప్టెన్సీలో ఆడాడు. ఈ సీజన్ లో భారీ హిట్టింగ్ చేస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో భారత జట్టుకు సెలక్ట్  అయిన దూబే సత్తా చాటుతున్నాడు. మొదట బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన ఈ ఆల్ రౌండర్..40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 60 నాటౌట్‌‌) భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. దూబే ఇలాగే ఆడితే 2024 టీ20 వరల్డ్ కప్ కు సెలక్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. 

గురువారం(జనవరి 11) జరిగిన తొలి టీ20లో ఇండియా 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో రోహిత్‌‌సేన 1–0 లీడ్‌‌లో నిలిచింది. టాస్‌‌ ఓడిన అఫ్గాన్‌‌ 20 ఓవర్లలో 158/5  స్కోరు చేసింది. మహ్మద్‌‌ నబీ (27 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 42) టాప్‌‌ స్కోరర్‌‌. అజ్మతుల్లా ఒమర్‌‌జాయ్‌‌ (29), ఇబ్రహీం జద్రాన్‌‌ (25) ఫర్వాలేదనిపించారు. తర్వాత ఇండియా 17.3 ఓవర్లలో 159/4 స్కోరు చేసి గెలిచింది.  టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో శివమ్‌‌ దూబె (40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 60 నాటౌట్‌‌) భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. జితేష్‌‌ శర్మ (31) రాణించాడు.