టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున భారీ సిక్సర్లతో విరుచుకుపడే దూబే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో ఒక బిగ్ సిక్సర్ కొట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు. జంపా వేసిన ఇన్నింగ్స్ 10 ఓవర్ రెండో బంతిని దూబే భారీ సిక్సర్ కొట్టాడు. ఈ లెగ్ స్పిన్నర్ వేసిన ఫ్లయిటేడ్ డెలివరీని దూబే స్ట్రెయిట్ గా కొట్టడంతో బంతి ఏకంగా స్టేడియం ధాటి బయట పడింది. 117 మీటర్లు వెళ్లిన ఈ సిక్సర్ కు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు షాకింగ్ కు గురయ్యారు. బంతి స్టేడియం ధాటి వెళ్లడంతో కొత్త బంతితో మ్యాచ్ ను కొనసాగించారు.
New ball please! Shivam Dube sent that one way out of the stadium 👀#AUSvIND pic.twitter.com/H5px77NuIa
— cricket.com.au (@cricketcomau) November 6, 2025
ఈ మ్యాచ్ లో దూబే మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 18 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో పర్వాలేదనిపించింది. మొదట బ్యాటింగ్ చేసి ఒక మాదిరి స్కోర్ కే పరిమితమయ్యారు. గురువారం (నవంబర్ 6) క్వీన్స్‌ల్యాండ్ లో కర్రారా ఓవల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఓపెనర్ శుభమాన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ (28), సూర్య కుమార్ యాదవ్ (20) కొన్ని మెరుపులు మెరిపించారు. చివర్లో అక్షర్ పటేల్ 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. బార్ట్ లెట్,మార్కస్ స్టోయినిస్ లకు తలో ఒక వికెట్ దక్కింది.
