పాకిస్థాన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు : శివసేన

పాకిస్థాన్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు : శివసేన

పాక్ దౌత్య సంబంధాలు తెంచుకున్న అంశంపై పెద్దగా విచారించాల్సి న అవసరం లేదన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. పాకిస్థాన్ తీసుకుంటున్న చర్యలపై ఆందోళన అవసరం లేదన్నారు. కశ్మీర్ పై భారత్ ఏనాడో నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పారు. పాక్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. శాంతి కోసం 70 ఏళ్లుగా పాకిస్థాన్ తో చర్చలు జరుపుతూనే ఉన్నామన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కర్మాగారంగా మారిందన్నారు సంజయ్. కశ్మీర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది భారత ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఆర్మీ నిర్ణయిస్తుందని చెప్పారు. కశ్మీర్ అంశంపై అమెరికా చర్చించాల్సిన అవసరమేం లేదన్నారు.

పాక్ కే నష్టం.. భారత్ కు టెన్షనేం లేదు : సల్మాన్ ఖుర్షీద్

భారత్ తో పాక్ దౌత్య  సంబంధాలను  తెంచుకోవడంపై  మాజీ  విదేశాంగ  శాఖ  మంత్రి  సల్మాన్  ఖుర్షీద్  స్పందించారు.  దౌత్య  సంబంధాలను తెంచుకోవడం  వల్ల  పాకిస్థాన్ కే నష్టమన్నారు.  ప్రస్తుత  కాలంలో  దౌత్య  సంబధాలను  కొనసాగించడం  అత్యంత  ముఖ్యమన్నారు.  పాక్  నిర్ణయం హస్యాస్పదమన్నారు.  పాక్  నిర్ణయంతో  భారత్ కు  వచ్చే నష్టమేం లేదన్నారు  ఖుర్షీద్.