ధోనీ రిటైర్మెంట్‌పై షోయబ్ అక్తర్ కామెంట్స్…

ధోనీ రిటైర్మెంట్‌పై షోయబ్ అక్తర్ కామెంట్స్…

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్‌పై కామెంట్ చేశారు పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ . ఆదివారం భారత మీడియాతో మాట్లాడిన ఆయన…  2019వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తాను అనుకున్నట్లు చెప్పారు. అయితే అదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు ధోనీ తన పూర్తి సామర్థ్యంతో భారత క్రికెట్ కు సేవలు అందించాడని తెలిపారు.  తాను ధోనీ ప్లేస్ లో ఉంటే ఎప్పుడో క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పేవాడినని చెప్పారు అక్తర్. 2011 వరల్డ్ కప్ తర్వాత తాను క్రికెట్ నుంచి వైదొలిగానని అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నానని చెప్పారు. అయితే భారత్ కూడా ధోనీని రిటైర్మెంట్ చేసేందుకు అనుమతించాలని అన్నారు.   ధోనీ ఓ మంచి క్రికెటరని, దాంతో పాటే మంచి వ్యక్తని కోనియాడారు. అయితే ప్రస్తుతం ధోని ఇరుక్కుపోయారని చెప్పారు.

2019 వరల్డ్ కప్ తర్వాత ధోనీ ఫేర్వెల్ సిరీస్ ఆడి తన ఆటను ముంగిస్తాడని తాను అనుకున్నానని అన్నారు అక్తర్. ప్రపంచ కప్ సెమీ ఫైనల్ తర్వాత ధోనీ భారత్ తరపున ఆడలేదని తెలిపారు. ఐపీఎల్‌లో ఆడి తన ఫాంను నిరూపించుకోవాలని అనుకుంటున్నాడని… అయితే కరోనా వలన ఐపీఎల్ జరిగేలాలేదని అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో ధోనీ రాణిస్తే అక్టోబర్ – నవంబర్ లో జరగబోయే టీ20 క్రికెట్ వరల్డ్ కప్ లో స్థానం లభించవచ్చని అన్నారు.