ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్లో మెద్వెదెవ్కు షాక్‌‌‌‌.. ఆస్ట్రేలియా ప్లేయర్ చేతిలో ఘోర ఓటమి

ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్లో మెద్వెదెవ్కు షాక్‌‌‌‌.. ఆస్ట్రేలియా ప్లేయర్ చేతిలో ఘోర ఓటమి

పారిస్‌‌‌‌: రష్యా స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ డానియెల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌కు.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఊహించని షాక్‌‌‌‌ తగిలింది. మంగళవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలిరౌండ్‌‌‌‌లో క్వాలిఫయర్‌‌‌‌ ఆడమ్‌‌‌‌ వాల్టన్‌‌‌‌ (ఆస్ట్రేలియా) 6–2, 1–6, 6–1, 1–6, 6–4తో ఆరోసీడ్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌పై సంచలన విజయం సాధించాడు. 3 గంటలా 22 నిమిషాల పాటు జరిగిన ఐదు సెట్ల పోరాటంలో వాల్టన్‌‌‌‌ పదునైన సర్వీస్‌‌‌‌లు, బలమైన గ్రౌండ్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌లతో చెలరేగాడు. 

మరో మ్యాచ్‌‌‌‌లో 17 ఏళ్ల మోయిస్‌‌‌‌ కువామే (ఫ్రాన్స్‌‌‌‌) తొలి గ్రాండ్‌‌‌‌స్లామ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లోనే అద్భుతం చేశాడు. యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ మారిన్‌‌‌‌ సిలిచ్‌‌‌‌ను 7–6 (7/4), 6–2, 6–1తో ఓడించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ విజయంతో గ్రాండ్ స్లామ్ మ్యాచ్ గెలిచిన పిన్న వయస్కుడిగా (2008 తర్వాత జన్మించిన వారిలో) కువామే చరిత్ర సృష్టించాడు. సిట్సిపాస్‌‌‌‌ (గ్రీస్‌‌‌‌) 6–2, 3–0 ఆధిక్యంలో ఉన్నప్పుడు అలెగ్జాండ్రే ముల్లర్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌) కాలి గాయం కారణంగా మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకున్నాడు. 

దాంతో సిట్సిపాస్‌‌‌‌కు వాకోవర్‌‌‌‌ విజయం లభించింది. బెన్ షెల్టన్‌‌‌‌ (అమెరికా) 6–3, 6–3, 6–4తో మెరిడా (స్పెయిన్‌‌‌‌)పై, కాస్పర్‌‌‌‌ రుడ్‌‌‌‌ (నార్వే) 6–2, 7–6 (7/5), 5–7, 0–6, 6–2తో రోమన్‌‌‌‌ సఫియుల్లిన్‌‌‌‌ (రష్యా)పై గెలిచారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌  సబలెంక (బెలారస్‌‌‌‌) 6–4, 6–2తో బౌజాస్‌‌‌‌ మనెరియో (స్పెయిన్‌‌‌‌)పై, కోకో గాఫ్‌‌‌‌ (అమెరికా) 6–4, 6–0తో టౌన్సెండ్‌‌‌‌ (అమెరికా)పై, ఒసాకా (జపాన్‌‌‌‌) 6–3, 7–6 (7/3)తో లారా సెగ్మండ్‌‌‌‌ (జర్మనీ)పై, ఇవా జోవిచ్‌‌‌‌ (అమెరికా) 6–4, 6–2తో అలెగ్జాండర్‌‌‌‌ ఎలా (ఫిలిప్పీన్స్‌‌‌‌)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌లోకి ప్రవేశించారు.