
ఏపీ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా ఎదిగిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 30 ఏండ్లుగా కుప్పంలో టీడీపీ తప్ప మరో పార్టీకి అవకాశం దక్కని జీడ్పీటీసీ స్థానాన్ని వైఎస్‌ఆర్ సీపీ సొంతం చేసుకుంది. ఊహించని రీతితో 23 ఏండ్ల యువతి.. చంద్రబాబు కంచుకోటను బద్దలు కొట్టింది. కుప్పంలో 1,073 ఓట్ల తేడాతో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి అశ్విని (23) విజయం సాధించారు. 30 ఏండ్ల రికార్డును ఆమె తిరగరాశారు. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో టిడిపి తప్ప మరో పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ గెలిచిన సందర్భం లేదు.