
హైదరాబాద్ సిటీలో మరో ఘోరం.. శివార్లలోని రామచంద్రాపురం పరిధిలోని బండ్లగూడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలాజీనగర్ లో ప్రేమికుల వ్యవహారం కలకలం రేపింది.
రమ్య, ప్రవీణ్ కొంతకాలంలో ప్రేమించుకుంటున్నారు. రమ్య డిగ్రీ చదువుతుండగా.. ప్రవీణ్ ఆమెతో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఏమైందో ఏమో.. ఇద్దరి మధ్య గొడవ జరిగిందా అనేది స్పష్టమైన సమాచారం బయటకు రాలేదుకానీ.. 2025, జూలై 7వ తేదీన బాలాజీనగర్ లోని ఇంట్లో రమ్య చనిపోయి ఉంది. రమ్య శరీరంపై కత్తిగాట్లు ఉన్నాయి. అక్కడే ప్రియుడు ప్రవీణ్ కూడా పడిఉన్నాడు. అతను స్పృహలో లేడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. చావుబతుకుల్లో ఉన్నాడని.. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
►ALSO READ | పట్టపగలు ఘోరం.. సొంత షాప్ ముందే ప్రముఖ వ్యాపారి హత్యా..
రమ్యను చంపి ప్రవీణ్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. రమ్య మెడపై కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. ఇద్దరూ ఆత్మహత్యకు ప్రయత్నించారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై రమ్య కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. వివరాలు తెలుసుకుంటున్నారు.