పట్టపగలు ఘోరం.. సొంత షాప్ ముందే ప్రముఖ వ్యాపారి హత్యా..

పట్టపగలు ఘోరం.. సొంత షాప్ ముందే ప్రముఖ వ్యాపారి హత్యా..

పంజాబ్‌లోని ఓ ఘటన శాంతి భద్రతలపై తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. తాజాగా పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని అబోహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సంజయ్ వర్మని సోమవారం ఉదయం అతని షాప్ ముందే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దింతో అతను అక్కడిక్కడే మృతి చెందారు.  అతను, అతని  అన్న జగత్ వర్మకు న్యూ వేర్ వెల్ అనే ఫెమస్ టైలరింగ్ షాప్ ఉంది. ఈ షాప్ పంజాబ్‌లో కుర్తా-పైజామా కుట్టడానికి చాలా పేరు పొందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అబోహార్‌లోని ప్రముఖ మార్కెట్‌లో ఉన్న అతని  షాప్‌కు సంజయ్ వచ్చిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగింది. ముగ్గురు దుండగులు అతనిపై కాల్పులు జరిపి, పక్కన పార్క్ చేసిన బైక్ పై అక్కడి నుంచి పారిపోయారు. దింతో వెంటనే సంజయ్‌ను సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అతను అప్పటికే  చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ హత్య ఎందుకు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, అతని కుటుంబం మాత్రం అతనికి ఎవరితోనూ గొడవలు లేవని, శత్రువులు లేరని చెబుతున్నారు. అయితే పోలీసులు హత్యకు గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.

 

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని అబోహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సంజయ్ వర్మని సోమవారం ఉదయం అతని షాప్ ముందే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దింతో అతను అక్కడిక్కడే మృతి చెందారు.

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని అబోహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సంజయ్ వర్మని సోమవారం ఉదయం అతని షాప్ ముందే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దింతో అతను అక్కడిక్కడే మృతి చెందారు.

ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు:  పట్టపగలు ఈ హత్య జరిగిన తరువాత  పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కురిపించారు. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు.

"పంజాబ్‌లో శాంతిభద్రతలు చాలా దిగజారిపోయాయి. అబోహార్‌లోని ది న్యూ వేర్ వెల్ టైలర్స్ ఓనర్  సంజయ్ వర్మ పై పట్టపగలు జరిగిన హత్య, ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అరాచకాన్ని స్పష్టం చేస్తోంది" అని సుఖ్‌బీర్ సింగ్ బాదల్  పోస్ట్ చేశారు.

"వ్యాపారవేత్తలు, డాక్టర్లు, కళాకారులు, అథ్లెట్లు వంటి నిపుణులు దోపిడీదారుల నుండి తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ దారుణమైన హత్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వర్మ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేరస్థులను వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలి. అబోహార్‌లో పట్టపగలు జరిగిన ఈ హత్య పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా లేవని  సునీల్ జాఖర్ అన్నారు.

ALSO READ : ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులకు ట్రస్ట్.. టాటా బోర్డ్ గ్రీన్ సిగ్నల్..

ఇలాంటి సంఘటనల తర్వాత కూడా ఆప్ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆయన విమర్శించారు.  పంజాబ్ పరువుకు మచ్చ తెచ్చిన ఈ సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో ప్రజలకు వివరించి, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.