మక్తల్, వెలుగు: తండ్రిని కొడుకులు కొట్టి చంపిన ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మున్సిపాలిటి పరిధిలోని తిర్మలాపురం గ్రామానికి చెందిన గొల్ల రాములు(56) పేరిట ఉన్న పొలాన్ని కొడుకులు కృష్ణ, వెంకటేశ్తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని అంటుండగా, అందుకు తండ్రి నిరాకరించడంతో కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈక్రమంలో సోమవారం తండ్రితో గొడవ పడిన కొడుకులు ఇనుప పలుగుతో కొట్టారు.
దీంతో రాములుకు తీవ్రగాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న రాములును బంధువులు, చుట్టుపక్కల వారు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
