
- సహకరించిన ఆమె తండ్రి
- వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన
- మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు
వికారాబాద్, వెలుగు: పరాయివాళ్లతో మాట్లాడొద్దని తిట్టినందుకు భర్తను మద్యం మత్తులో ఉండగా, భార్య తన తండ్రితో కలిసి హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్‌జిల్లా తాండూరులో జరిగింది. సీఐ నాగేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలంలోని మల్కాపూర్‌కు చెందిన వెంకటేశ్ (33), జయశ్రీ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో మూడేండ్ల కింద భార్య జయశ్రీ పుట్టింటికి వెళ్లింది. మళ్లీ 2 నెలల కింద భర్త వద్దకు వచ్చింది. అయితే, వచ్చిన దగ్గరనుంచీ భార్యపై భర్త వెంకటేశ్ అనుమానం పెంచుకున్నాడు.
వేరే ఎవరితోనూ మాట్లాడుతున్నావని భార్య జయశ్రీని తిట్టాడు. నిత్యం వేధింపులు తట్టుకోలేక భర్తను హత్య చేయాలని జయశ్రీ నిర్ణయించుకున్నది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చి పడుకున్న వెంకటేశ్‌ను తండ్రి సహాయంతో గొంతు నులిమి హత్య చేసింది. వెంకటేశ్తల్లి అంజిలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.