జెట్ స్పీడ్తో ‘హరి హర వీరమల్లు మూవీ షూటింగ్

జెట్ స్పీడ్తో  ‘హరి హర వీరమల్లు మూవీ షూటింగ్

పవన్ కళ్యాణ్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫస్ట్ టైమ్ పీరియాడికల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోన్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని ఎ.ఎమ్.రత్నం, ఎ.దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు నిర్మిస్తున్నారు. రకరకాల కారణాలతో షూటింగ్ మధ్యలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ... తిరిగి స్పీడు పెంచారు. అక్టోబర్ చివరి వారం నుండి రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ సిటీలో వేసిన భారీ సెట్‌‌‌‌‌‌‌‌లో  కంటిన్యూగా షూటింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ క్రమంలో షూట్ గురించి మరో క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చింది టీమ్. పవన్‌‌‌‌‌‌‌‌తో పాటు తొమ్మిది వందల మంది నటీనటులు ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నారని, ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇదొక మైల్‌‌‌‌‌‌‌‌ స్టోన్ మూవీ అవుతుందని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులంతా సంబరాలు జరుపుటారనే నమ్మకం ఉందన్నారు.  వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి తాము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి అందరి ప్రేమ, మద్దతు అందిస్తారని కోరుకుంటున్నాం.. అని  మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ప్రకటించింది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరగడంతో పాటు ఎప్పుడెప్పుడు థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.