నిజాంపేట్ లోని బొమ్మల షాపులో అగ్నిప్రమాదం

నిజాంపేట్ లోని బొమ్మల షాపులో అగ్నిప్రమాదం

నిజాంపేట్ లోని బొమ్మల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 70లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నట్లు యజమాని, స్దానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే..  బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్ మెయిన్ రోడ్డులో ఉన్న "బేబి & టాయిస్" షాపులో అగ్నిప్రమాదం జరిగింది. షాపు యజమాని నర్సింగ్ రావు రాత్రి షాపును మూసివేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం సుమారు 8 గంటలకు షాపులోపలి నుంచి పొగలు రావడంతో స్దానికులు గమనించారు. సమాచారం అందుకున్న నర్సింగ్ రావు.. వచ్చి షాపు తెరిచి చూడగా అప్పటికే లోపల మంటలు రాజుకుంటున్నాయి. షటర్ ఓపెన్ చేయడంతో బైట గాలికి మంటలు ఇంకా పెద్దగా అవ్వడంతో ఫైర్ సిబ్బంకి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది...  ఫైర్ ఇంజిన్ సహయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇదే బిల్డింగ్ పై అంతస్తులో  ఓ పాఠశాల కూడా ఉంది. స్కూల్ విద్యార్థులు అప్పుడే స్కూల్ కు వస్తుండటంతో ప్రమాదం తప్పింది. ఇక ప్రమాదం కారణంగా సుమారు 70లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని షాపు యజమాని నర్సింగ్ రావు తెలిపాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.  బాచుపల్లి పోలీసులు ఘటనా స్దలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.