సర్వర్ డౌన్ : RTA సేవలకు ఆటంకం

సర్వర్ డౌన్ : RTA సేవలకు ఆటంకం

వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలు సోమవారం పూర్తిగా నిలిచిపోయాయి. రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోని సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో అన్ని ఆర్టీఏ ఆఫీస్ లలో పనులునిలిపేశారు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అర్ధరాత్రి తలెత్తిన సమస్య
ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ సప్లయ్ లో షార్ట్సర్క్యూట్ కారణంగా సర్వర్ లో సమస్య తలెత్తింది.ఆదివారం సెలవు రోజు కావటంతో సోమవారం ఉదయానికి గానీ అధికారులు సమస్యను గుర్తించలేదు.మెయిన్ సర్వర్ లో ప్రాబ్లమ్ ను పరిష్కరించే సరికే మధ్యాహ్నం 2.00 గంటలైంది. దీంతో అన్ని ఆఫీసుల్లో రోజంతా సేవలు నిలిపివేస్తున్నామని బోర్డులుపెట్టే శారు. సోమవారం స్లాట్ బుక్ చేసుకున్న వారికిమంగళవారం, లేదా ఇంకోరోజు అవకాశం కల్పిస్తా -మని అధికారులు చెప్ పారు.

2 లక్షల మందికి ఇక్కట్లు
సర్వర్ లో సమస్య వల్ల దాదాపు 2 లక్షల మందిఇబ్బంది పడ్డా రు. రాష్ట్రం లో 74 ఆర్టీఏ ఆఫీసులుం-డగా, ప్రస్తుతం పూర్తిగా 56 సేవలను ఆన్ లైన్‌‌లోనేఅందిస్తున్నారు. లర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్ కోసంస్లాట్ బుక్ చేసుకునే వారే ఎక్కువగా ఉంటా రు.రోజూ 30 వేలు–35 వేల మంది వరకు లెర్నింగ్  లైసె-న్సుల కోసం 20 వేల మందికి పైగా పర్మినెంట్ లైసెన్సుల కోసం బుక్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్లు 10 వేలవరకు ఉంటాయి. ఫిట్ నెస్ సర్టిఫికెట్, ఎన్ఓసీ వంటిసేవల కోసం 10 వేల మంది బుక్ చేసుకుంటారు.