పహిల్వాన్లకు సౌలత్లు కల్పించాలి.. రెజ్లింగ్ అకాడమీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

పహిల్వాన్లకు సౌలత్లు కల్పించాలి.. రెజ్లింగ్ అకాడమీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

కాచిగూడ, వెలుగు: పహిల్వాన్లకు అవసరమైన శిక్షణ వసతులు కల్పించి, రెజ్లింగ్ అకాడమీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

 మంగళవారం బాగ్ లింగంపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 98 రెజ్లింగ్ అకాడమీల్లో మ్యాట్లు వంటి కనీస వసతులు కూడా లేవన్నారు. ఈ సమస్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు. 

జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారుల ఖర్చులను తానే భరిస్తానని, ఎల్బీ స్టేడియంలో భారీ రెజ్లింగ్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ చైర్మన్ సలాం ఖాన్, అధ్యక్షులు సంతోష్, కార్యదర్శి అస్లాంఖాన్, ఖలీద్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.