ఈరవర్తి అనిల్కు షోకాజ్ నోటీసు

ఈరవర్తి అనిల్కు షోకాజ్ నోటీసు

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఈరవర్తి అనిల్కు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు పంపింది.  గతంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై  అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనకు నోటీసు ఇచ్చింది. వివరణకు  ఐదు రోజుల గడువు ఇచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని ఈరవర్తి అనిల్ గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తనకు టికెట్ రావొద్దని ఆనాడు ఉత్తమ్ ప్రయత్నించారని అన్నారు. అయితే భట్టి విక్రమార్క పట్టుబట్టి తనకు టికెట్ ఇప్పించారన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న క్రమశిక్షణ కమిటి వివరణ ఇవ్వాలంటూ అనిల్ కు షోకాజ్ నోటీసు పంపింది.