నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల మొదటి దశ మీటింగ్కు గైర్హాజరైన 206 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నాగర్ కర్నూల్ డీపీవో శ్రీరాములు తెలిపారు. ఈ నెల 6న పంచాయతీ ఎన్నికల శిక్షణ శిబిరం నిర్వహించగా.. 206 మంది హాజరుకాలేదు. దీంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు, 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. లేని పక్షంలో వారిపై తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం –2018లోని సెక్షన్ 224 ప్రకారం చర్యలు తీసుకుంటామని డీపీవో స్పష్టంచేశారు.

