మూడు వేల మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

మూడు వేల మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

ఎన్నికల్లో విధులు నిర్వహిం చే అధికారులు, సిబ్బంది పాత్ర కీలకం. ఓటరు నమోదు, పోలింగ్‌, కౌంటింగ్‌ ఇలా ప్రతి దశలోనూ ప్రజలకు వారధిగా నిలవాల్సిన బాధ్యత వీరిదే. అందుకే ప్రతిసారి అధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారులు శిక్షణ ఇస్తుంటారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు తీసుకుకోవాల్సిన జాగ్రత్తల్నివివరిస్తారు. కానీ పార్లమెంట్ ఎన్నిక ల నిర్వహణ సందర్భంగా నిర్వహిస్తున్న శిక్షణను చాలా మంది లెక్క చేయడం లేదు. 9శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చూపుతున్నారు. అలాంటి అధికారులు, సిబ్బందిపై జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ సీరియస్ గా ఉన్నా రు. హైద రాబాద్ జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల లో నిర్వహించిన శిక్షణ కు హాజ రు కాని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మంగళవారం షోకాజ్‍ నోటీసులు జారీచేశారు. హైద రాబాద్ జిల్లాలో పీఓ, ఏపీఓ విధులు నిర్వహించడానికి మొత్తం 10 వేల మంది ఉద్యోగులకు ఎన్నికల విధుల ఉత్తర్వులు జారీ చేయగా 17, 18 తేదీల లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి 7 వేల మంది మాత్రమే హాజరయ్యారు. గైర్హాజరైన వారికి నోటీసులు జారీ చేశామ ని తెలిపారు. 17, 18 తేదీల లో హాజరుకాని ఉద్యోగులకు మరో అవకాశంగా ఈనెల 22వ తేదీన సికింద్రాబాద్ హరిహరకళాభవన్ లో మరోసారి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని దానకిశోర్‍ తెలిపారు.మొన్న హాజరుకాని వారంతా 22న తప్పనిసరిగా రావాలని ఆదేశించారు. ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నారని , ఎట్టి పరిస్థితులో నూమిన హాయింపు కుదరదని స్పష్టం చేశారు. ఎన్నిక ల విధుల కు హాజ రుకాని వారిపై ప్రజాప్రాతినిధ్య చ ట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్టు దానకిశోర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నా రు.