హెచ్ఆర్సీ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

హెచ్ఆర్సీ సీరియస్.. సుమోటోగా కేసు స్వీకరణ

బషీర్​బాగ్, వెలుగు: శివగంగా కాలనీలో కుక్కల దాడి ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై పలు దిన పత్రికలో వచ్చిన వార్తలను సుమోటో కేసుగా స్వీకరించింది. ప్రజా భద్రతపై ఏర్పడిన ఆందోళనలు, వీధికుక్కల నియంత్రణలో కనిపించిన లోపాలు, బాలుని జీవనహక్కు, గౌరవహక్కులకు భంగం కలిగిన అవకాశాల నేపథ్యంలోఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధిత బాలుడి పరిస్థితి, కుక్కల స్టెరిలైజేషన్, నియంత్రణ చర్యల స్థితి, అలాగే సుప్రీం కోర్టు ఆదేశాల అమలు పరిస్థితిపై సమగ్ర నివేదికలను ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ను ఆదేశించింది. ఈ నివేదికలను ఈ నెల 29 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది.