
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా విమెన్స్–ఎ జట్టును గురువారం ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, పేసర్ టిటాస్ సాధును టీమ్‌లోకి తీసుకున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి వీళ్లకు క్లియరెన్స్ రావాల్సి ఉంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఇద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు.
వచ్చే నెల 7 నుంచి 24 వరకు జరగనున్న ఈ టూర్‌లో ఇండియా.. ఆసీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల మ్యాచ్ ఆడనుంది.
టీ20 జట్టు: రాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి, షెఫాలీ వర్మ, వ్రిందా, సాజన సాజీవన్, ఉమా ఛెత్రి, రాఘవి బిస్త్, శ్రేయాంక పాటిల్, ప్రేమ రావత్, నందిని కశ్యప్, తనుజా కన్వర్, జోషితా, శబ్నం షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు.
వన్డే, నాలుగు రోజుల మ్యాచ్‌కు జట్టు: రాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి, షెఫాలీ వర్మ, తేజల్ హసబిన్స్, రాఘవి బిస్త్, తనుశ్రీ సర్కార్, ఉమా ఛెత్రి, ప్రియా మిశ్రా, తనుజా కన్వర్, నందిని కశ్యప్, ధారా గుజ్జర్, జోషితా, శబ్నం షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు.