టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్.. వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. జట్టులో వైభవ్ కి చోటు

టీమిండియా కెప్టెన్ గా శ్రేయస్.. వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. జట్టులో వైభవ్ కి చోటు

 

Shreyas Iyer: భారత టీ20 క్రికెట్‌లో సరికొత్త శ్రేయస్ అయ్యర్ ఎరా అఫీషియల్‌గా షురువైంది. ఈరోజు (శనివారం) అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అందరినీ షాక్‌కు గురిచేసేలా సంచలన నిర్ణయాన్ని అనౌన్స్ చేసింది. మొన్నటిదాకా టీమిండియాను నడిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తీసేయడమే కాకుండా.. ఏకంగా టీ20 జట్టు నుంచే టోటల్‌గా పక్కనబెట్టేశారు. ఆయన ప్లేస్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ లీడర్ శ్రేయస్ అయ్యర్‌ను భారత కొత్త టీ20 కెప్టెన్‌గా అఫీషియల్‌గా డిక్లేర్ చేశారు.

జట్టు నుంచి సూర్య అవుట్: 
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ అదిరిపోయే రేంజ్‌లో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకుంది. కానీ, కెప్టెన్సీ సూపర్‌గా ఉన్నా.. గత కొంతకాలంగా సూర్య బ్యాటింగ్ ఫామ్ మస్తు ఘోరంగా పడిపోవడం బోర్డుకు నచ్చలేదు. దానికి తోడు 2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఫ్యూచర్ కోసం ఒక స్ట్రాంగ్ యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలనే ప్లాన్‌తోనే సెలక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

శ్రేయస్ అయ్యరే కరెక్ట్: 
ఇంకోవైపు, ఐపీఎల్‌లో బ్యాటర్‌గానే కాకుండా, తన మైండ్ బ్లోయింగ్ లీడర్‌షిప్ స్కిల్స్‌తో వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్స్‌కు తీసుకెళ్లిన రికార్డు శ్రేయస్ అయ్యర్ సొంతం. అందుకే టీమిండియా నెక్స్ట్ ఫేజ్‌ను లీడ్ చేయడానికి శ్రేయస్ అయ్యరే పక్కా కరెక్ట్ లీడర్ అని సెలక్షన్ కమిటీ ఫిక్స్ అయిపోయింది. జూన్ 26 నుంచి షురువయ్యే ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో (Asian Games) కూడా శ్రేయస్ అయ్యరే మన జట్టును నడిపించబోతున్నాడు.

వైస్ కెప్టెన్‌గా మన తెలుగోడు తిలక్ వర్మ: 
ఈ సెలక్షన్ మీటింగ్‌లో మన తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మన హైదరాబాద్ పొరగాడు, తెలుగు క్రికెట్ స్టార్ తిలక్ వర్మను టీమిండియా టీ20 జట్టుకు అఫీషియల్ వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. భవిష్యత్తు లీడర్‌షిప్ ప్లాన్స్‌లో భాగంగానే తిలక్‌కు ఈ కీలక బాధ్యత అప్పగించారు. ఆయనతో పాటు వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మూడు జట్లలోనూ చోటు దక్కించుకుని దుమ్ములేపాడు.

వైభవ్ కి పిలుపు: 
ఇక ఈ స్క్వాడ్ సెలక్షన్‌లో మరో బిగ్గెస్ట్ సెన్సేషన్ ఏంటంటే.. ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి మైండ్ బ్లాక్ చేసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఈ చిన్న వయసులోనే ఆయన ఏకంగా మూడు మెయిన్ స్క్వాడ్స్ (ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆసియా క్రీడలు) లోనూ చోటు సంపాదించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు.


ఇంగ్లాండ్ సిరీస్‌ కి భారత టీ20 స్క్వాడ్: 
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్

ఐర్లాండ్ తో భారత్ టీ20 సిరీస్ స్క్వాడ్: 
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్

ఏషియన్ గేమ్స్ కి భారత టీ20 జట్టు: 
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి