టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా ఏ తో జరుగుతున్న రెండో అనధికారిక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. మంగళవారం (సెప్టెంబర్ 23) మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందు అయ్యర్ అకస్మాత్తుగా జట్టును విడిచి ముంబై వెళ్ళాడు. ఈ సిరీస్ లో ఇండియా ఏ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న అయ్యర్ సడన్ గా తప్పుకోవడం వెనుక కారణం ఏంటో తెలియలేదు. శ్రేయాస్ చివరి నిమిషంలో జట్టు నుండి వైదొలగడంతో ఆస్ట్రేలియా ఏ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ కు ధ్రువ్ జురెల్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్ గా నియమించారు.
అయ్యర్ తప్పుకోవడం వెనక ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించలేదు. వ్యక్తిగత కారణమని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. " శ్రేయాస్ అయ్యర్ ఆస్ట్రేలియా ఏ తో జరిగే రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో తాను ఆడలేనని అతను సెలెక్టర్లకు తెలియజేసినట్టు సమాచారం. వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం అయ్యర్ పోటీలో ఉంటాడని కొన్ని వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియా 'ఎ' తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఇండియా 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటర్ గా ఈ ముంబై స్టార్ ఘోరంగా విఫలమయ్యాడు.
తొలి ఇన్నింగ్స్ లో 13 పరుగులే చేసి నిరాశపరిచాడు.
►ALSO READ | Asia Cup 2025: తొలి విజయం ఎవరిది: కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌దే టాస్.. శ్రీలంక బ్యాటింగ్
ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లోనే రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్న అయ్యర్.. మూడు ఫార్మాట్లలో జట్టుకు ప్రధాన ఆటగాడిగా నిరూపించుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. వన్డే సెటప్‌లో కొనసాగుతూనే టెస్ట్, టీ20 జట్టులో స్థానం దక్కించుకునే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఇండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచి జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్ లో చోటు దక్కించుకోలేకపోయిన అయ్యర్.. వెస్టిండీస్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో ఛాన్స్ దక్కుతుందో లేదో చూడాలి.
