క్వారంటైన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ

V6 Velugu Posted on Oct 12, 2021

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ అందరికీ షాక్ ఇచ్చింది. కరోనా టైమ్‌లో తను ఓ ఆడబిడ్డకు జన్మను ఇచ్చానని చెప్పి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏడాది పాటు దాచిపెట్టిన ఈ బ్యూటీ.. భర్త ఆండ్రీ కొశ్చేవ్‌తోపాటు బిడ్డతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. గతేడాది క్వారంటైన్ టైమ్‌లో గందరగోళ పరిస్థితుల మధ్య అందరూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని.. కానీ ఆ టైమ్‌లో తాను అందమైన అనుభవాలను మూటగట్టుకున్నానని శ్రియ పేర్కొంది. ఓ అందమైన ఏంజెల్ తమ జీవితంలోకి వచ్చిందని.. అందుకు దేవుడికి కృతజ్ఞతలు అని శ్రియ పోస్ట్ చేసింది. 

మరిన్ని వార్తలు: 

నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది: ప్రకాశ్ రాజ్

ఈ సెంచరీ నుంచి 130 ఏండ్లు బతకొచ్చట!

‘మా’ ఎన్నికల్లో బయటపడ్డ కులాల లొల్లి

Tagged pregnancy, Baby Girl, Actress Shriya Saran, Andrei Koscheev

Latest Videos

Subscribe Now

More News