ఈ సెంచరీ నుంచి 130 ఏండ్లు బతకొచ్చట!

ఈ సెంచరీ నుంచి 130 ఏండ్లు బతకొచ్చట!

ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 90 ఏండ్లు బతికిన వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చేమో. ఎందుకంటే మనిషి లైఫ్‌‌‌‌ స్పాన్‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌ సుమారు 79 ఏండ్లు అని కొంతమంది రీసెర్చర్స్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు. కానీ అంత కంటే ఎక్కువ కాలం బతికిన వారి సంఖ్య ఎక్కువే ఉంది. అయితే ఓ ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ మహిళ 122 సంవత్సరాలు బతికి రికార్డు సృష్టించింది. ఆమెను చూసి ఆయుష్షును పెంచుకోవచ్చనే ఐడియా వచ్చింది కొందరు ఫ్రెంచ్​ సైంటిస్టులకు. ఈ రీసెర్చ్‌‌‌‌లో ఈ శతాబ్ధం నుంచి 122 ఏండ్లు కాదు 130 ఏండ్లు జీవించడం సాధ్యమే అన్న విషయం తేలింది. వీరి ప్రయోగాలను అనుసరించి మనిషి గరిష్ఠ జీవిత కాలాన్ని అంచనా వేస్తూ ఇప్పటి నుంచి నూట ముప్ఫై ఏండ్లు బతకొచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. కానీ 110  ఏండ్లు బతికిన వాళ్లు ఆపై  బతికే చాన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీయే ఉంటుందట. ఒకవేళ వారు ఈ నంబర్​ దాటితే మాత్రం నూట ముప్ఫై ఏండ్లు బతికే అవకాశం ఉంటుందట. ఒకవైపు ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్నాయి. అయినా ఈ సెంచరీ నుంచి లైఫ్​ స్పాన్‌‌‌‌‌‌‌‌ పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని వారు రీసెర్చర్స్​ చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌, ఇటలీలో 130 ఏండ్లు బతికిన వారు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఇంగ్లాండ్, వేల్స్‌‌‌‌‌‌‌‌లో మాత్రం 1968–2017 మధ్య 110 ఏండ్లు పైబడి బతికిన వాళ్లు కేవలం157 మంది మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆల్కహాల్‌‌‌‌, సిగరెట్లు వంటి అలవాట్లకు దూరంగా ఉంటూ.. లైఫ్​ స్టైల్‌‌‌‌ను కొద్దిగా మార్చుకుంటే మాత్రం లైఫ్​ స్పాన్‌‌‌‌‌‌‌‌ పెరిగే అవకాశం ఉంటుందని, ఈ విషయాలపై దృష్టిసారించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.