విశ్వనటుడికి కూతురు పుట్టినరోజు శుభాకాంక్షలు

విశ్వనటుడికి కూతురు పుట్టినరోజు శుభాకాంక్షలు

నేడు విశ్వనటుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కూతురు శృతి హాసన్ తన తండ్రికి వెరైటీగా విషెస్ తెలిపింది. కమల్ హాసన్ చిన్నప్పటి ఫొటోతో పాటు హ్యాపీ బర్త్ డే బాపూజీ అనే క్యాప్షన్ ను జత చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న  ఈ చిన్ననాటి ఫొటోలో కమల్ క్యూట్ లుక్స్ తో ఆకర్షిస్తున్నాడు. అయితే బాలనటుడిగా “కలత్తూర్ కన్నమ్మ ” మూవీతో కోలీవుడ్ కు పరిచయమైన కమల్ హాసన్ దక్షిణాది భాషలతో పాటు హిందీ, బెంగాలీ బాషలలో 230 మూవీస్ కు పైగా నటించారు. పలు భాషల్లో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కమల్ హాసన్.. ఇప్పటికీ ఆయనకున్న ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోగా రాణిస్తూనే... యాక్టర్ , రైటర్ , డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్ , లిరిసిస్ట్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమకు 6 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కమల్ హాసన్ ను పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

ఇక సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శృతి హాసన్.. ఇటీవల కొన్ని సినిమాలను నిషేధించాలని వస్తోన్న ప్రచారంపై స్పందించింది. ఇది కూడా ఒకరకమైన బెదిరింపు చర్యేనని, ఒక రకంగా దాడి చేయడం లాంటిదేనని తెలిపింది.ఈ కల్చర్ సమాజంలో విద్వేషాలు నింపేలా మారిపోయాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక  శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, బాలకృష్ణ, చిరంజీవి వంటి హీరోల సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.