తొలి టెస్టు ఇండియా గుప్పిట్లోకి..

తొలి టెస్టు ఇండియా గుప్పిట్లోకి..
  • సెంచరీలతో చెలరేగిన జూనియర్, సీనియర్
  • తొలి టెస్టు ఇండియా గుప్పిట్లోకి
  • 513 రన్స్ టార్గెట్ ఛేజింగ్ లో ప్రస్తుతం బంగ్లా 42/0

చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టులో ఇండియా భారీ విజయంపై కన్నేసింది. యంగ్‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌ శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (152 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110) కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలి సెంచరీకి తోడు  సీనియర్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ చతేశ్వర్‌‌‌‌‌‌‌‌ పుజారా (130 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 102 నాటౌట్‌‌‌‌‌‌‌‌) నాలుగేళ్ల తర్వాత వంద దంచడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను టీమిండియా పూర్తిగా తన కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో తడబడి కోలుకున్న బ్యాటర్లు.. సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో రెచ్చిపోవడంతో  బంగ్లాకు 513 రన్స్‌‌‌‌‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. మరోవైపు వరుసగా రెండో రోజూ హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ తేలిపోయింది. కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (5/40) కెరీర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ స్పెల్‌‌‌‌‌‌‌‌తో మెప్పించడంతో మూడో రోజు, శుక్రవారం బంగ్లా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 55.5 ఓవర్లలో 150  రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. అప్పటికే 254 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ లభించినా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ బంగ్లాకు ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వలేదు. దాంతో, మళ్లీ బ్యాటింగ్​కు వచ్చిన ఇండియా గిల్‌‌‌‌‌‌‌‌, పుజారా ధనాధన్‌‌‌‌‌‌‌‌ ఆటతో 61.4 ఓవర్లలో 258/2 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేసింది. భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో మూడో రోజు చివరకు బంగ్లా 12 ఓవర్లలో 42/0 స్కోరుతో నిలిచింది. ఓపెనర్లు నజ్ముల్‌‌‌‌‌‌‌‌ శాంటో (25 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), జాకిర్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌ (17 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. మరో రెండ్రోజుల ఆట మిగిలున్న మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాకు 471 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా, ఇండియా విజయానికి 10 వికెట్లు కావాలి.

అదే జోరు

రెండో రోజు బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్న ఇండియా.. మూడో రోజు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో  జోరు కొనసాగించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరు 133/8తో ఆట కొనసాగించిన బంగ్లా మరో 17 రన్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే జోడించింది. ఎబాదత్‌‌‌‌‌‌‌‌ (17)ను ఎల్బీ చేసిన కుల్దీప్‌‌‌‌‌‌‌‌ ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకోగా.. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ (25)ను అక్షర్‌‌‌‌‌‌‌‌(1/10) స్టంపౌట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఆ తర్వాత ఇండియా బ్యాటర్ల జోరు మొదలైంది. గిల్‌‌‌‌‌‌‌‌తో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించిన రాహుల్‌‌‌‌‌‌‌‌ (23)  కుదురుకున్నట్టే కనిపించినా ఖలీల్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో పుల్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌ ఆడబోయి ఔటయ్యాడు.  ఆ తర్వాత గిల్‌‌‌‌‌‌‌‌కు పుజారా తోడయ్యాడు. తనదైన టైమింగ్‌‌‌‌‌‌‌‌తో గిల్‌‌‌‌‌‌‌‌ బంగ్లా బౌలర్లను ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ వరుసగా బౌండ్రీలు రాబట్టాడు. దాంతో, పుజారా క్రీజులో కుదురుకునేందుకు తగిన టైం లభించింది. తర్వాత గిల్‌‌‌‌‌‌‌‌తో పోటాపోటీగా చతేశ్వర్‌‌‌‌‌‌‌‌ కూడా షాట్లు కొట్టాడు. అయితే, ఇద్దరిలో 23 ఏండ్ల గిల్‌‌‌‌‌‌‌‌  బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ముచ్చటగొలిపింది. చాలా ఈజీగా స్ట్రోక్స్‌‌‌‌‌‌‌‌ ఆడిన తను స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో  స్వీప్‌‌‌‌‌‌‌‌, రివర్స్‌‌‌‌‌‌‌‌ స్పీప్ షాట్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. పేసర్ల లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్స్‌‌‌‌‌‌‌‌ను, లెగ్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ వేసిన బాల్స్‌‌‌‌‌‌‌‌ను అలవోకగా బౌండ్రీలైన్ దాటించాడు. ఈ క్రమంలో తనకు అదృష్టం కూడా తోడైంది. రెండుసార్లు ఎల్బీ అయినా డీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో బతికిపోయాడు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ గిల్‌‌‌‌‌‌‌‌ మిరాజ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు బాది  సెంచరీ (147 బాల్స్‌‌‌‌‌‌‌‌లో) అందుకున్నాడు.  ఆ తర్వాత మిరాజ్‌‌‌‌‌‌‌‌ ఓవర్లోనే అతను ఔటవడంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. మరోవైపు పుజారా తన స్టయిల్‌‌‌‌‌‌‌‌కు భిన్నంగా స్పీడ్‌‌‌‌‌‌‌‌గా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు.  గిల్‌‌‌‌‌‌‌‌ ఔటైన తర్వా త కోహ్లీ (19 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో కలిసి జోరు కొనసాగించాడు.  ఫుల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆడిన అతను 87 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ దాటగా.. మరో 43 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఇంకో 50 రాబట్టాడు. అతను సెంచరీ దాటగానే రాహుల్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను డిక్లేర్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

1443 రోజుల తర్వాత

పుజారా 1443 రోజుల గ్యాప్​ తర్వాత టెస్టుల్లో సెంచరీ కరువు తీర్చుకున్నాడు. చివరగా 2019 జనవరిలో ఆస్ట్రేలియాపై  వంద కొట్టిన తను ఇన్నాళ్లకు మళ్లీ మూడంకెల స్కోరు చేశాడు. పుజారాకు ఇది 19వ సెంచరీ. అతని కెరీర్​లో ఇదే ఫాస్టెస్ట్​ సెంచరీ (130 బాల్స్​లో) కావడం విశేషం.

సంక్షిప్త స్కోర్లు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 404 ఆలౌట్‌‌‌‌‌‌‌‌;  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 150 ఆలౌట్ (ముష్ఫికర్‌‌‌‌‌‌‌‌ 28, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ 5/40); ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌:258/2 డిక్లేర్డ్‌‌‌‌‌‌‌‌ (గిల్‌‌‌‌‌‌‌‌ 110, పుజారా 102 *, ఖాలెద్‌‌‌‌‌‌‌‌ 1/51); బంగ్లా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్‌‌‌‌‌‌‌‌ 513): 42/0 (శాంటో 25*,  జాకిర్‌‌‌‌‌‌‌‌ 17*)