
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ తన సూపర్ బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ కు కట్టిపడేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేస్తేనే గగనం అనుకుంటే ఏకంగా 269 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 147 పరుగులు చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ ఇన్నింగ్స్ పై అతని తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారుతుంది.
మ్యాచ్ తర్వాత గిల్ తన తండ్రి చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చాడు. "నేను డబుల్ సెంచరీ కొట్టగానే నా నాన్న ఫోన్ చేసి నన్ను అభినందించాడు. అంతేకాదు ట్రిపుల్ సెంచరీ ఎందుకు మిస్ చేశావు అని అడిగాడు". అని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ ట్రిపుల్ సెంచరీ చేస్తే చూడాలని యావత్ దేశం మొత్తం కోరుకుంది. టంగ్ వేసిన షార్ట్ డెలివరీకి డీప్ స్క్వేర్ లెగ్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 269 పరుగుల గిల్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ మ్యాచ్ లో జడేజాతో కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన గిల్.. సుందర్ తో కలిసి 144 పరుగులను జత చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.
►ALSO READ | టాప్ ప్లేస్ లోనే గుకేశ్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (387 బాల్స్‌లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లతో 269).. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రికార్డుల మోత మోగించాడు. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో ఇండియాకు భారీ స్కోరు అందించాడు. రవీంద్ర జడేజా (89) కూడా ఓ చేయి వేయడంతో.. 310/5 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 రన్స్‌కు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (42) ఫర్వాలేదనిపించాడు.
షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 77/3 స్కోరు చేసింది. జో రూట్ (18 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్‌లో వరుస బాల్స్‌లో ఆకాశ్‌దీప్ (2/36) దెబ్బకు బెన్ డకెట్ (0), ఒలీ పోప్ (0) డకౌటయ్యారు. జాక్ క్రాలీ (19)ని సిరాజ్ దెబ్బకొట్టాడు. ప్రస్తుతం హోమ్ టీమ్ ఇంకా 510 రన్స్ వెనకబడి ఉంది.
Shubman Gill said, "my father called me and congratulated, but he also said I missed my Triple century". 😂❤️ pic.twitter.com/txlj7cN2R7
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2025