సారాకు గుడ్ బై చెప్పేశాడా..! లండన్ వీధుల్లో బాలీవుడ్ నటితో గిల్

సారాకు గుడ్ బై చెప్పేశాడా..! లండన్ వీధుల్లో బాలీవుడ్ నటితో గిల్

భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ ప్రేమాయణం మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ నటితో కలిసి గిల్ లండన్ వీధుల్లో కనిపించడమే అందుకు కారణం. ఓ అందాల ముద్దగుమ్మతో గిల్ లండన్‌లో చక్కర్లు కొడుతున్నాడు. దీంతో ఈ యువ క్రికెటర్ సారాకు గుడ్ బై చెప్పి.. కొత్త బంధానికి తెరలేపాడనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రస్తుతానికి గిల్.. అవనీత్ కౌర్‌తో కలసి లండన్ టూర్‌లో ఉన్నాడు. వీరిద్దరూ లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో అతని స్నేహితులు కూడా కనిపిస్తున్నారు. గిల్ బ్రౌన్ లాంగ్ బ్లేజర్‌లో ధరించగా, అవనీత్ కౌర్ నలుపు రంగు దుస్తుల్లో ఉంది.

రిలేషన్ నిజమేనా..!

గిల్- అవనీత్ కౌర్ రిలేషన్‌ నిజమేనా అనేది వారిద్దరికే తెలియాలి. ప్రస్తుతానికి వీరిద్దరూ ఒక మ్యూజిక్ వీడియో చేస్తున్నారు. దాని షూటింగ్ నిమిత్తం లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే అభిమానుల ఆరోపణలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. గిల్.. సారాకు గుడ్ బై చెప్పి, బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు.