టీ 20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయిన శుభమన్ గిల్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది.. దానికి క్లారిటీ ఆన్సర్ ఇప్పుడు దొరికింది. రంజీ మ్యాచ్ లు ఆడనున్నాడు.. అవును.. పంజాబ్ తరపున రంజీ ట్రోఫీలో శుభమన్ గిల్ ఆడనున్నాడు.శుభ్‌మన్ గిల్ 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తరపున రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు, తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియాలో చేరనున్నాడు.
2025-26 విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24 నుండి జనవరి 18 వరకు జరుగుతుంది, అయితే ఇండియా న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేలు జనవరి 11న వడోదరలో, జనవరి 14న రాజ్‌కోట్‌లో జనవరి 18న ఇండోర్‌లో జరగనున్నాయి.గిల్ జనవరి 3, 6 తేదీలలో జైపూర్‌లో సిక్కిం, గోవాతో జరిగే పంజాబ్ ఎలైట్ గ్రూప్ సి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడనున్నాడు. ఆ తర్వాత, ఇండియా న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత, రంజీ ట్రోఫీలోని మిగిలిన గ్రూప్ మ్యాచ్‌లలో పంజాబ్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించనున్నాడు.
ALSO READ : ధోనీ నా కెరీర్ నాశనం చేశాడా..
శనివారం ఇండియా టీ20 టీంలో చోటు దక్కలేదని తెలిసిన తర్వాత ప్రీమియర్ డొమెస్టిక్ రెడ్ బాల్ టోర్నమెంట్ లో ఆడాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గిల్ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఇండియా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు, ఈ సిరీస్ లో పేలవమైన పర్ఫామెన్స్ కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌తో పాటు 2026 T20 ప్రపంచ కప్‌కు గిల్‌ను తొలగించాలని నిర్ణయించింది సెలెక్షన్ కమిటీ.
