IND vs ENG, 2nd Test: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమాన్ గిల్‌కు గాయం

IND vs ENG, 2nd Test: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమాన్ గిల్‌కు గాయం

వైజాగ్ టెస్టులో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభమాన్ గిల్ గాయపడ్డాడు. మూడో రోజు బ్యాటింగ్ సెంచరీతో భారత్ భారీ టార్గెట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన గిల్.. ఇదే రోజు సాయంత్రం ఫీల్డింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైంది. దీంతో నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ కు చేయడానికి గిల్ మైదానంలోకి వెళ్లడం లేదని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. గిల్ స్థానంలో ఫీల్డింగ్ చేయడానికి నాలుగో రోజు సర్ఫరాజ్ అహ్మద్ వచ్చాడు. 
     
గిల్ గ్రౌండ్ లోకి ఎప్పుడు అడుగుపెడతాడో లేదో చెప్పలేని పరిస్థితి. గాయంపై వివరణ రావాల్సి ఉంది. గత కొంతకాలంగా గిల్ పేలవ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నెంబర్ 3 లో బ్యాటింగ్ చేస్తూ గిల్ ఘోరంగా విఫలమవుతున్నాడు. చివరి 10 ఇన్నింగ్స్ ల్లో ఒక్కసారి కూడా 50 పరుగుల మార్క్ చేరుకోలేకపోయాడు. అయితే కెరీర్ కు కీలకంగా మారిన వైజాగ్ టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. 147 బంతుల్లో 104 పరుగులు చేసి విమర్శకులకు సమాధానం చెప్పాడు. తొలి ఇన్నింగ్స్ లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. 

గిల్ సెంచరీతో ఇంగ్లాండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతుంది. 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్ క్రాలి (66), బెయిర్ స్టో (9) ఉన్నారు. నైట్ వాచ్ మెన్ రెహన్ అహ్మద్ (23), పోప్ (23) రూట్ (16) త్వరగానే ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ కు మూడు, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది.