IND vs ENG 2025: లేని పరుగు కోసం రిస్క్ అవసరమా.. చేజేతులా రనౌటైన గిల్

IND vs ENG 2025: లేని పరుగు కోసం రిస్క్ అవసరమా.. చేజేతులా రనౌటైన గిల్

ఇంగ్లాండ్ తో జరుగుతున్నఓవల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ చేజేతులా రనౌట్ అయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి 21 పరుగులకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 28 ఓవర్ లో అట్కిన్సన్ వేసిన రెండో బంతిని గిల్ డిఫెన్స్ ఆడాడు. బంతి ముందే ఉన్నా క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అప్పటికే బౌలింగ్ వేస్తూ సగం పిచ్ వద్దకు వచ్చిన అట్కిన్సన్ డైరెక్ట్ త్రో తో గిల్ ను రనౌట్ చేశాడు. తనని తానే రనౌట్ చేసుకున్నందుకు ఈ టీమిండియా కెప్టెన్ గ్రౌండ్ లోనే తీవ్ర నిరాశకు గురయ్యాడు. లేని పరుగు కోసం రన్ అనవసరంగా తీశాడని నెటిజన్స్ బాధపడుతున్నారు.

ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ 21 పరుగులకే ఔట్ కావడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. గిల్ ఔట్ కావడంతో 83 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (0), సాయి సుదర్శన్ (28) క్రీజ్ లో ఉన్నారు. రెండో సెషన్ లో మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ మరోసారి నిలిచిపోయింది. ఇంగ్లాండ్ మూడు వికెట్లు తీసి ముందంజలో ఉంది ఫామ్ లో ఉన్న రాహుల్ (14) తో పాటు జైశ్వాల్ (2) తొలి సెషన్ లో ఔటయ్యారు. 

ఈ సిరీస్ లో ఇప్పటివరకు 737 పరుగులు చేసిన గిల్.. ఒకే టెస్ట్ సిరీస్ లో అత్యధిక  పరుగులు చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ టీమిండియా కెప్టెన్ ఈ ఘనతను అందుకున్నాడు. 1979లో వెస్టిండీస్‌పై గవాస్కర్ 732 పరుగులు చేసిన రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ లోకి వెళ్ళాడు. టీమిండియా నాలుగు మార్పులతో మ్యాచ్ ఐదో టెస్ట్ ఆడుతుంది. జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో ప్రసిద్ కృష్ణ  ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. శార్దూల్ ఠాకూర్ పై వేటు పడగా.. అతని స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్ కరుణ్ నాయర్ తుది జట్టులోకి వచ్చాడు. పంత్ దూరం కావడంతో ధృవ్ జురెల్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ స్థానం సంపాదించాడు.