
జూన్‌లో భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ ఇంగ్లండ్ అద్భుత పెర్ఫార్మెన్ కనబర్చాడు.ఎడ్జ్‌బాస్టన్‌లో 269 పరుగులతో సహా ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో 754 పరుగులు సాధించాడు.సిరీస్‌లో రికార్డులను బద్దలు కొట్టాడు. సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో అతను టీమ్ ఇండియాను అద్భుతంగా నడిపించాడు.గిల్ కు ఇండియాలోనే కాదు ఇంగ్లండ్ లో కూడా మస్త్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.. ఇందుకు నిదర్శనం అతని జెర్సీ అత్యధికంగా అమ్ముడు పోవడమే.. వివరాలేంటో చూద్దాం..
ఇంగ్లండ్‌తో 2025 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ ధరించిన వైట్ ,నేవీ నంబర్ 77 జెర్సీ, రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ఛారిటీ కోసం నిర్వహించిన వేలంలో సుమారు రూ.4.85 లక్షల కు అమ్ముడైంది. ఈ జెర్సీ రెడ్ ఫర్ రూత్ డే సందర్భంగా గిల్ ధరించిన స్పెషల్-ఎడిషన్ ఇండియా టెస్ట్ షర్ట్.. దీనిపై అతని సంతకం కూడా ఉంది. ఈ వేలంలో అన్ని జట్ల నుంచి అత్యధిక మొత్తం పొందిన వస్తువుగా ఈ జెర్సీ నిలిచింది. శుభ్‌మాన్ గిల్ ధరించిన లాంగ్-స్లీవ్ టెస్ట్ జెర్సీ, రెడ్ ఫర్ రూత్ డే సందర్భంగా లార్డ్స్‌లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఉపయోగించారు.
రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ,మద్దతు కోసం నిధుల సేకరణ కోసం ఈ వేలం నిర్వహించారు. ఈ వేలంలో జస్‌ప్రీత్ బుమ్రా ,రవీంద్ర జడేజా జెర్సీలు కూడా భారీ మొత్తం తో అమ్ముడయ్యాయి. బుమ్రా, జడేజాల జెర్సీలు ఒక్కొక్కటి రూ.4లక్షల43 వేలకు అమ్ముడయ్యాయి.
ఈ వేలం రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ కోసం నిర్వహించారు.ఇది మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ స్ట్రాస్ స్మారకార్థం నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి ,రోగులకు మద్దతు అందించడానికి పనిచేస్తుంది. శుభ్‌మాన్ గిల్ ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో 754 పరుగులు సాధించి అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది ఈ జెర్సీకి వేలంలో అధిక డిమాండ్‌కు కారణమైంది.