హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు

హైకోర్టును ఆశ్రయించిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు

ఎస్ఐ, కానిస్టేబుల్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నపత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు మార్కులు కలిపేలా ఆదేశాలివ్వాలని వారు పిటిషన్లో కోరారు. అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల పేర్లు కూడా లిస్టులో లేవని.. వారి పేర్లను వెంటనే జాబితాలో చేర్చేలా ఆదేశించాలని అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు.

మరోవైపు ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు అవకతవకలపై ఎన్ఎస్యూఐ డీజీపీకి ఫిర్యాదు చేసింది. కటాఫ్ మార్కుల్లో అవకతవకలు, తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన దృష్టికి తెచ్చారు. తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు కలపాలని కోరారు. క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల పేర్లను లిస్టులో పెట్టలేదన్న విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించారు. ప్రతి అభ్యర్థి మార్కుల లిస్టు రిలీజ్ చేయాలని, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ కోరింది.