రోడ్డు ప్రమాదంలో ఎస్సై కుమార్తె మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్సై కుమార్తె మృతి

పంజాగుట్ట, వెలుగు:హెల్త్​చెకప్ కోసం సిటీకి వచ్చిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. చెంగిచెర్లకు చెందిన మేది శంకరరావు ఎస్పీఎఫ్​విభాగంలో ఎస్సైగా మణుగూరు పవర్​ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ప్రసన్న (25) ఎంఎస్సీ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ లో ఉంది. తన హెల్త్ చెకప్ కోసం సోమాజిగూడలోని ఏఐజీ ఆస్పత్రికి తండ్రితో కలిసి సోమవారం బైక్ పై బయలుదేరింది. బేగంపేట మెట్రో స్టేషన్​ సమీపంలో వారి బైక్ ను టెంపో వాహనం ఢీ కొనడంతో ప్రసన్న కిందపడి దుర్మరణం చెందింది.  స్వల్పంగా గాయపడిన శంకర్ రావును సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 
నాగారంలో మరో యువతి..

కీసర: మరోచోట బైక్ నుంచి కిందపడిన యువతి పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని ఆర్ఎల్ఆర్ నగర్ బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగింది. నేరేడ్మెట్ కు చెందిన రమ్య (20), నాగారంలో బైక్ మెకానిక్ పనిచేస్తున్న కౌశిక్  కలిసి సోమవారం ఘట్​ కేసర్ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో నీటి ట్యాంకర్ ఢీ కొనడంతో ఇద్దరు కిందపడ్డారు. అయితే, ఘట్​కేసర్ నుంచి సికింద్రాబాద్​ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు యువతి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు.. డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.