కర్నాటక సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకే జై

కర్నాటక సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకే జై
  • కర్నాటక సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్యకే జై
  • ఆయనవైపే 40% మంది మొగ్గు
  • బస్వరాజ్ బొమ్మైకి 22% మంది మద్దతు
  • సీఎం అభ్యర్థిని చూసిఓటేస్తామన్న 4% మంది
  • ఎన్డీటీవీ-లోక్ నీతి సర్వేలో వెల్లడి

బెంగళూరు: కర్నాటక సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యవైపే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఆయనే మళ్ళీ సీఎం కావాలని దాదాపు 40% మంది మద్దతు పలికారు. ప్రస్తుత సీఎం, బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై మళ్లీ సీఎం కావాలని 22% మంది కోరుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటేస్తామని 4% మందే స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై ఈ మేరకు ఎన్డీటీవీ- లోక్‌నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అయితే, తమ ఓటు ఎవరికి వేస్తామనేది ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఆధారపడి ఉంటుందని కేవలం నాలుగు శాతం మంది మాత్రమే చెప్పారు. ఇక జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి సీఎం కావాలని 15% మంది మాత్రమే కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. అయితే, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్నామని 4 శాతం మంది మాత్రమే చెప్పారు. సిద్ధరామయ్య 2018 వరకు సీఎంగా ఉండగా, ఆయన స్థానంలో కుమారస్వామి ఏడాది పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సర్వేలో ఈయన మూడో ప్లేస్​లో ఉండగా.. రాజకీయాల నుంచి తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప నాలుగో ప్లేస్ లో ఉండటం విశేషం.

.సీఎంగా మంచి పేరు 

2006లో జేడీఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన సిద్ధరామయ్య.. 2010లో బీజేపీకి చెందిన మైనింగ్ వ్యాపారులు గాలి జనార్ధన్ రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రతో పార్టీలో అగ్ర నేతగా ఎదిగారు. 2013లో బీసీ వర్గం నుంచి సీఎంగా పదవిని చేపట్టి సమర్థమైన కాంగ్రెస్ సీఎంలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

పెద్దవాళ్లలో ఆదరణ

75 ఏళ్ల సిద్ధరామయ్య వృద్ధులలో బాగా ఆదరణ పొందుతున్నారని ఈ సర్వేలో తేలింది. 56 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 44 శాతం మంది ప్రజలు ఆయనకు మద్దతు పలికారు. 18-–25 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 40% మంది మాత్రమే ఆయన్ను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకున్నారు.63 ఏళ్ల బొమ్మై పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. వృద్ధుల సమూహంలోని 22% మంది.. 18-25 ఏళ్లలో 28% మంది మాత్రమే అతనిని తిరిగి సీఎంగా కోరుకుంటున్నారు.

సీఎం అభ్యర్థిని బట్టి ఓటేసేటోళ్లు కేవలం

4% అభ్యర్థులను బట్టి కాకుండా పార్టీని బట్టే ఓటు వేస్తామని మెజారిటీ ఓటర్లు సర్వేలో తేల్చి చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 56 శాతం మంది తాము పార్టీ వైపు వెళతామని చెప్పగా, 36 శాతం మంది అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని దృష్టిలో ఉంచుకుని ఓటు వేసే వారి శాతం మరింత తక్కువగా కేవలం 4 శాతం మాత్రమే ఉంది. కాంగ్రెస్‌ మద్దతుదారులు ఎక్కువగా పార్టీకి మద్దతు ఇస్తున్నారని సర్వేలో తేలింది. బీజేపీ మద్దతుదారులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.  పార్టీని చూసి ఓటు వేస్తామని 49% మంది చెప్పగా, అభ్యర్థికే తమ ప్రాధాన్యత అని 47% మంది చెప్పారు.

2,143 మంది ఓటర్లపై సర్వే

21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 82 పోలింగ్ స్టేషన్‌ల పరిధిలో ఉన్న 2,143 మంది ఓటర్ల ను ఇంటర్వ్యూ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల మూడ్‌ను అంచనా వేయడా నికి సర్వే చేపట్టారు. "మల్టీ-స్టేజ్ సిస్టమాటిక్ రాండమ్ శాంప్లింగ్" పద్ధతిలో వారిని ఎంపి క చేశారు. అంటే నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్‌లు, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తు లు అందరూ యాదృచ్ఛికంగా ఎంపికయ్యా రు. శాంపిల్ సైజ్ చిన్నదే అయినా రాష్ట్రంలో ని  ఓటర్ల మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందని సర్వే సంస్థలు పేర్కొన్నాయి.