
- పిల్లలకు 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసిన జిల్లాగా రికార్డు
- 2019 సంవత్సరానికి ప్రైమ్ మినిస్టర్ అవార్డుకు ఎంపిక
సిద్దిపేట, వెలుగు: చిన్నారులకు వంద శాతం వ్యాక్సినేషన్ ఇచ్చిన జిల్లాగా సిద్దిపేట నిలిచింది. మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులో సిద్దిపేట జిల్లా టార్గెట్‌ను పూర్తి చేసినందుకు 2019 సంవత్సరానికి గాను ప్రైమ్ మినిస్టర్ అవార్డుకు ఎంపికైంది. వివిధ కారణాలతో వ్యాక్సిన్లు వేసుకోలేని చిన్నారులను గుర్తించి, అందరికీ టీకాలు వేయడంలో జిల్లా అధికారులు, సిబ్బంది సక్సెస్ అయ్యారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్ర ధనుష్ కేటగిరీలో జిల్లాను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 20, 21తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘సివిల్ సర్వీసెస్ డే’లో రూ.10 లక్షల క్యాష్ ప్రైజ్‌తో పాటు అవార్డు అందజేయనుంది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.